నాన్‌ లే అవుట్‌ వెంచర్లపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

నాన్‌ లే అవుట్‌ వెంచర్లపై ఆగ్రహం

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

నాన్‌ లే అవుట్‌ వెంచర్లపై ఆగ్రహం

ప్లాట్లు రిజిస్ట్రేషన్లు కాకుండా ఫిర్యాదు చేయాలని కౌన్సిలర్ల విన్నపం

వెంచర్లు, అక్రమ నిర్మాణాలపై

బాన్సువాడ బల్దియా సమావేశంలో చర్చ

బాన్సువాడ : పట్టణ పరిధిలో నాన్‌ లే అవుట్‌వెంచర్లపై బాన్సువాడ మున్సిపల్‌ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్‌ కాసుల విజయబాల్‌రాజ్‌ అధ్యక్షతన గురువారం బల్దియా సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ హకీం మాట్లాడుతూ.. పట్టణంలో వెలు స్తున్న వెంచర్లు ఏ ఒక్కటి కూడా డీటీసీపీ లే అవుట్‌ కాలేదని, అయినప్పటికీ రియల్టర్లు నాన్‌ లే అవుట్‌ ప్లాట్లను అమాకులకు విక్రయిస్తు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. ఇళ్లు నిర్మించుకుందామంటే మున్సిప ల్‌ అధికారులు అనుమతులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. నాన్‌ లే అవుట్‌ వెంచర్లలోని ప్లాట్లు విక్రయించకుండా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. భారత్‌ గార్డెన్‌ పక్కన పా ర్కుకు వెళ్లే దారిలో 40 ఫీట్ల రోడ్డుపై అక్రమ నిర్మా ణం జరుగుతోందని కౌన్సిల్‌ దృష్టికి తెచ్చారు. పట్టణంలో నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారని కౌన్సిలర్లు పేర్కొనగా, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి జరిమానాలు విధిస్తామని కమిషనర్‌ గంగాధర్‌ అన్నారు. వైస్‌ చైర్‌పర్సన్‌ రేష్మాబేగం, సీనియర్‌ అసిస్టెంట్‌ మల్లికార్జున్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement