● చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం:బెట్టింగ్ భూతం ఒకరిని బలితీసుకుంది. బెట్టింగ్‌తో నష్టపోయి ఓ వ్యక్తి చెట్టు కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో ని రామారెడ్డి రోడ్డులో గురువా రం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎమ్మార్ కాలనీకి చెందిన అంకం క్రాంతి కుమార్ (40)కు భార్య లావణ్య, కుమార్తె సంయుక్త, కవలలైన కుమారులు విఘ్నేష్, వినాయక్ ఉన్నారు. కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ మధ్య దాదా పు రూ.12 లక్షల వరకు బెట్టింగ్‌లో నష్టపోయాడని, దీంతో అప్పులు పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన క్రాంతికుమార్ తిరిగి రాలేదు. ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని గురువారం ఉదయం సమాచారం రావడంతో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు.


