చౌక్‌బాల్ గేమ్ గురించి అందరికీ పూర్తిగా తెలియదు. ఈ ఆట క్రీడాకారుల మధ్య ఫిజికల్ టచ్ లేని ఆట. టెక్నిక్‌తో ఆడితే విజయం సాధించగలుగుతారు. క్రీడాకారులు మెలకువలు నేర్చుకొని ఆటలో అమలు చేసి విజయం సాధిస్తున్నారు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేసి ఆటకు వన్నె తేవడంతోపాటు వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను.
– డి. సంజీవ్,పీఈటీ,మిసిమి హైస్కూల్, కమ్మర్‌పల్లి
పీఈటీ నేర్పిన మెలకువలతో చౌక్‌బాల్ అంతర్జాతీయ పోటీల్లో రాణించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తా. మెడల్ సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకువస్తా.
– సీహెచ్. శాశ్వంత్, క్రీడాకారుడు


