కామారెడ్డి అర్బన్: 14 ఏళ్లలోపు బాలబాలికలు పనిలో కాకుండా బడిలో ఉండాలని, బాలలతో పనిచేయించే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించే వాల్‌పోస్టర్లను ఎస్పీ గురువారం ఆవిష్కరించారు. బాలబాలికలకు విద్య, రక్షణ కల్పించడం తమ బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో సాధన సంస్థ జిల్లా సమన్వయకర్త గిరిజ, సీఎంఎస్ మమత, సంధ్యారాణి, విశ్వజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
సీతారాంపూర్ గ్రామంలో ..
ఎల్లారెడ్డిలో..


