సిరికొండ : మండల కేంద్రంలోని కామారెడ్డి రోడ్‌లో పెట్రోల్ బంకు ఎదుట గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. తూంపల్లి గ్రామానికి చెందిన అనుగంటి సాయిలు, అయినాల అశోక్ రావుట్ల గ్రామానికి బైక్‌పై వెళుతుండగా ట్యాంకర్ లారీకి ఢీకొన్నారు. దీంతో బైక్ నడుపుతున్న సాయిలుకు తీవ్రగాయాలు, వెనుక కూర్చున్న అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


