యాప్‌తో ఇబ్బంది రాకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

యాప్‌తో ఇబ్బంది రాకుండా చూడాలి

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

యాప్‌తో ఇబ్బంది రాకుండా చూడాలి నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం అనుమానాస్పదస్థితిలో 50 గొర్రెలు మృతి సన్మానం

నిజామాబాద్‌ అర్బన్‌ : కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌తోనే రైతుల కు ఇబ్బందులు వస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠిని గురువారం కలిసి యూ రియా యాప్‌తో రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్‌, గద్దె భూమన్న, ప్రమోద్‌ కుమార్‌, నక్క రాజేశ్వర్‌, అనంత్‌ రెడ్డి, నూతల శ్రీనివాస్‌, తిరుపతి రెడ్డి, కర్క గంగారెడ్డి , విజయ్‌ కష్ణ, బొబ్బిలి వేణు తదితరులు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌ : నగరంలోని మిర్చి కంపౌండ్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలోని 33 కేవీ ఇంటర్‌ లింకింగ్‌ లైన్‌, ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి 33/11 కేవీ మిర్చి కంపౌండ్‌ సబ్‌స్టేషన్‌ వరకు లైన్‌ మరమ్మతుల కారణంగా శుక్రవారం నిర్ధిష్ట సమయాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతుందని టౌన్‌–1 ఏడీఈ చంద్రశేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మిర్చి కంపౌండ్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని కాంగ్రెస్‌ భవన్‌, కవితా కాంప్లెక్స్‌, గంజ్‌, రాంగోపాల్‌ స్ట్రీట్‌, దేవి రోడ్‌, మిర్చి కంపౌండ్‌ తదితర ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నామని పేర్కొన్నారు. 11 కేవీ రైల్వే ఫీడర్‌లో సైతం 7 నుంచి 11 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఏడీఈ చంద్రశేఖర్‌ తెలిపారు.

ఫోరెనిక్స్‌ ల్యాబ్‌కు నమూనాలు

భిక్కనూరు :మండలంలోని బస్వాపూర్‌ గ్రా మంలో గురువారం అనుమానాస్పద స్థితిలో 50 గొర్రెలు మృతి చెందాయి. గ్రామంలోని కందూరి సాయిలుకు చెందిన పది గొర్రెలు బు ధవారం మృతి చెందాయి. పశు సంవర్ధక శాఖ అధికారులు పంచనామా నిర్వహించి చిటుకు వ్యాధితో మృతి చెందినట్లు తొలుత నిర్ధారించారు. అయితే, గురువారం అదే మందలో ఉన్న సాయిలుకు చెందిన మరో 50 గొర్రెలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి భరత్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భరత్‌, పశు వైద్యాధికారులు మౌనిక రెడ్డి, అనిల్‌ రెడ్డి, రాంచందర్‌, రామ్‌ప్రసాద్‌, గోపాలమిత్ర సురేశ్‌ ఘటనా స్థలానికి చేరుకొని గొర్రెల కళేబరాలకు పోస్టుమార్టం చేశారు. నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అస్వస్థతకు గురైన గొర్రెలకు చికిత్స అందించారు. బాధితులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, తహసీల్దార్‌ సునీత, సర్పంచ్‌ తుడుం పద్మ పరామర్శించారు.

నిజామాబాద్‌ రూరల్‌: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృత భాషా శిక్షణ శిబిరం గురువారం ము గిసింది. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు అధ్యక్షుడు శశికాంత్‌ కులకర్ణి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు కులకర్ణి, ప్రోగ్రాం చైర్మన్‌ నాలం రమేశ్‌రావు, రిటైర్డ్‌ డిప్యూటీ డీఈవో కృష్ణారావు, కోశాధికారి మిలింద్‌కుమార్‌, రత్నాకర్‌, హనుమంతరావును ఘనంగా సన్మానించారు. రెండు రోజులశిక్షణ శిబిరం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. అరుణ్‌కుమార్‌ శర్మ, అశోక్‌ శర్మ, లక్ష్మీనారాయణ భరద్వాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement