● డీఐఈవో రవికుమార్
ఖలీల్‌వాడి : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని బాలికలు అధిక శాతం ఉత్తీర్ణులయ్యారని డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. ఫస్టియర్ జనరల్ విభాగంలో విద్యార్థినిలు 5,241 మంది పరీక్షలకు హాజరుకాగా 3,839 మంది పాసై 73.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 4,908 మంది హాజరుకాగా 2,687 మంది పాసై 54.77 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మొ త్తం 10,147 మంది హాజరుకాగా 6,526 మంది పాసై 64.31 శాతం సాధించారు. వొకేషనల్ కోర్సులో బాలికలు 329 మంది పరీక్షలు రా యగా, 257 మంది పాసై 78.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 960 మంది పరీక్షలకు హాజరై 679 మంది పాసై 70.73 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం 1,289 మంది పరీక్షలకు హాజరుకాగా 931 మంది పాసై 72.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో బాలికలు 2,0 66 పరీక్షలకు హాజరుకాగా 1,204 పాసై 58.2 8 శాతం, బాలురు 3,470 మంది పరీక్షలకు హాజరుకాగా 1,896 మంది పాసై 54.84 శా తం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,536 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,100 మంది పాస్ కావడంతో 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్ విభాగంలో బాలికలు 162 మంది పరీక్షలు రాయగా, 106 మంది పా సై 65.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలు రు 771 మంది పరీక్షలకు హాజరై 420 మంది పాస్ కాగా 54.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 933 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 526 మంది పాసై 56.38 శాతం ఉత్తీర్ణత సాధించారని డీఐఈవో తెలిపారు.


