● బాన్సువాడ ఇరిగేషన్ ఆఫీస్‌లో పగిలిన టైల్స్..
బాన్సువాడ : బాన్సువాడ డివిజన్ నీటిపారుదల శాఖ కార్యాలయం అధ్వానంగా మారింది. ఈకార్యాలయాన్ని బాన్సువాడలోని సాయికృపానగర్ కాలనీలో నిర్మించారు.కార్యాలయం నిర్మించి ఐదేళ్ల పూర్తవుతున్నా.. మూడేళ్ల క్రితం ప్రారంభించారు. కార్యాలయం నిర్మాణ సమయంలో బెస్‌మెంట్‌లో మొరంకు బదులుగా నల్లమట్టి వేయడంతో కార్యాలయంలో గోడలు పూర్తిగా కుంగిపోయాయి. బెస్‌మెంట్ కిందికి దిగి పోవడంతో కార్యాలయ గదుల్లో వేసిన టైల్స్ పగిలిపోయాయి. కార్యాలయంలో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఉన్నతాధికారులు స్పందించాలి.


