మాచారెడ్డి: పాల్వంచ మండల కేంద్రంలో బుధవారం నూతనంగా 14 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. మల్లికార్జున స్వామి ఆలయం నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూచని శేఖర్ మాట్లాడుతూ... మండల కేంద్రంలోని రహదారి పక్క కాలనీలో ఎన్ని రోజులు విద్యుత్ వెలుగులు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్యం, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నారు.
కామారెడ్డి టౌన్ : స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్‌టీయూ) ఉమ్మడి రాష్ట్ర ఆత్మీయ సమ్మేళన సభకు జిల్లా కేంద్రం నుంచి సంఘం నాయకులు బుధవారం తరలివెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి సభకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ కలిముద్దీన్, ప్రధాన కార్యదర్శి పంపరి ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు జిల్లా నాయకులు వెళ్లారు.
భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన యువకుడు వంగేటి నిహిత్‌రెడ్డి అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. బుధవారం గ్రామంలో నిహిత్‌రెడ్డిని సర్పంచ్ కుంట లింగారెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. నిహిత్‌రెడ్డిని శాలువతో మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు బీంరెడ్డి, నాయకులు ధర్మయ్య, కోకస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, నర్సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని చిట్యాల రోడ్డు నుంచి సోమారంకు వెళ్లే రోడ్డును బాగుచేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత రెండు సంవత్సరాలక్రితం వేసిన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోడ్డుపై వెళ్లే ద్విచక్రవాహనదారులు పలుమార్లు అదుపుతప్పి కిందపడిన ఘటనలు ఉన్నాయి. రాత్రివేళలో ఈరోడ్డు గుండా వెళ్లాలంటే వాహనదారులు భయపడుతున్నారు. అలాగే తాడ్వాయి శివారులోని రోడ్డులో తమ్మలవాని వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.


