క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

చిట్టుకు రోగంతో 10 గొర్రెల మృతి

అనుమానాస్పదస్థితిలో ఒకరి మృతి

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు. వివరాలు ఇలా.. అంకాపూర్‌ గ్రామంలోని ముఖాంబిక హోటల్‌లో పనిచేసే సునీల్‌(42) అనే వ్యక్తి బుధవారం మద్యం తాగి ఇంటికి వచ్చి బోర్లా పడుకున్నాడు. కొద్దిసేపటికి లేచి తన బెడ్‌ రూంలో నిద్రపోయాడు. రాత్రి ఏడుగంటలకు భార్య ఎంత పిలిచినా, కదిలించినా అతడు లేవలేదు. దీంతో ఆమె వెంటనే స్థానిక వైద్యుడిని ఇంటికి పిలువగా, అతడు పరిశీలించి సునీల్‌ అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో చిట్టుకు రోగంతో 10 గొర్రెలు మృతి చెందినట్లు భి క్కనూరు పశువైద్యాధికారి మౌనికరెడ్డి బుధవారం తెలిపా రు. బస్వాపూర్‌లో గొ ర్రెలు మృతిచెందిన విషయం తెలుకున్న తాను జంగంపల్లి పశువైద్యాధికారి అనిల్‌రెడ్డితో కలిసి గ్రామానికి వెళ్లామన్నారు. అక్కడే మృతి చెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక లక్షణాలు, పోస్టుమార్టం పరిశీలన ప్రకారం చిట్టుకు (ఎంటరోటాక్సీమియా) వ్యాధి, అనుమానిత కేసుగా గుర్తించమన్నారు. గొర్రెలు, మేకలు పెంపకందారులు తమ పశువులకు చిట్టుకు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని సూచించారు. గోపాలమిత్ర సురేష్‌ ఉన్నారు.

ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా పలువురు ఆర్‌ఎంపీ వైద్యులపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల పేరుతో వైద్యం అందిస్తున్నారని తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఫిర్యాదు మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ పోలీసులకు ఇటీవల విన్నవించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలువురు ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు అయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement