మాచారెడ్డి/కామారెడ్డి అర్బన్/నస్రుల్లాబాద్/గాంధారి: తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికే పంపించాలని పాల్వంచ ఎంపీడీవో శ్రీనివాస్ కోరారు. బుధవారం పాల్వంచ మండలం సింగరాయపల్లిలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు బడిలోని అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేటుకు పంపకుండా సర్కారు బడికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీపతి, ఉపాధ్యాయులు గ్రామస్తులు ఉన్నారు.
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు బడిబాట నిర్వహించారు. హెడ్‌మాస్టర్లు సాయిరెడ్డి, నళిని, సాయాగౌడ్, హన్మాండ్లు, సర్పంచ్ లక్ష్మి, ఉపసర్పంచ్ లక్ష్మి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లక్ష్మి, మాజీ సర్పంచులు ఆనందరావు, రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గాంధారి మండల పరిధిలో పలు గ్రామాల్లో బడిబాట నిర్వహించారు. ఈసందర్భంగా ఎంఈవో శ్రీహరి మాట్లాడారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో బడిబయట పిల్లలను బడిలో చేర్పించాలని ఉపాధ్యాయులు ప్రచారం చేశారు. ఈసందర్భంగా పీఆర్‌టీయూ మండల అధ్యక్షులు గునిగెరి హన్మాండ్లు మాట్లాడారు.


