ఎన్‌డీసీసీబీలో ‘సంపద’ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌డీసీసీబీలో ‘సంపద’ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీం

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

ఎన్‌డీసీసీబీలో ‘సంపద’ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీం

సుభాష్‌నగర్‌: అన్ని బ్యాంకుల కన్నా అధిక వడ్డీ రేటు ఎన్‌డీసీసీబీ ఇస్తుందని, వినియోగదారుల కోసం ‘సంపద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌’ స్కీంను ప్రవేశపెట్టినట్లు జిల్లా సహకార అధికారి (డీసీవో) ఎన్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఎన్‌డీసీసీబీ ఆధ్వర్యంలో నూతన డిపాజిట్‌ పథకం పోస్టర్లను నగరంలోని ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీవో మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్న ప్రత్యేక డిపాజిట్‌ పథకం సందప అని తెలిపారు. ఈ పథకం ద్వారా సాధారణ డిపాజిటర్లకు 8 శాతం వార్షిక వడ్డీ, సీనియర్‌ సిటిజన్లకు 8.50 శాతం వడ్డీ అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు, రైతులకు 103 సంవత్సరాలుగా బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్న ఎన్‌డీసీసీ బ్యాంకులో సురక్షితంగా పెట్టుబడి పెట్టి, అధిక వడ్డీ ద్వారా సంపదను మరింత భద్రంగా దాచుకోవడానికి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఈవో నాగభూషణం వందే, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, బ్యాంకు ఉన్నతాధికారులు లింబాద్రి, గజానంద్‌, అనుపమ, సుమమాల, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement