గ్యాస్‌ సిలిండర్‌ లీకై వ్యాపించిన మంటలు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ లీకై వ్యాపించిన మంటలు

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

ముగ్గురికి గాయాలు

కామారెడ్డి క్రైం: గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ కావడంతో మంటలు వ్యాపించి ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన మౌనిక ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై మంటలు ఎగసిపడి మౌనిక చీరకు అంటుకోవడంతో కేకలు వేసింది. ఆమె అత్త మల్లవ్వ, కుమార్తె అలేఖ్య, భర్తలు వచ్చి మంటలు ఆర్పేశారు. ఈక్రమంలో మౌనికతో పాటు అత్త, కుమార్తెలకు గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో కిచెన్‌లో వ్యాపించిన మంటలను ఆర్పి వేసింది. గాయపడిన వారిని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సిలిండర్‌ లీకేజీపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement