నిషేధం.. కాగితాలకే పరిమితం | - | Sakshi
Sakshi News home page

నిషేధం.. కాగితాలకే పరిమితం

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

నిషేధం.. కాగితాలకే పరిమితం

రోజువారీ చెత్త సేకరణ, నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగపు వివరాలు

నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగించొద్దు

జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్‌ వాడకం రోజురోజుకూ విస్తరిస్తోంది. కిరాణా దుకాణాలు, హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, చికెన్‌, మటన్‌ సెంటర్లు, పండ్ల దుకాణాలు, వీధి వ్యాపారులు ఇలా ఒకటేమిటి.. ప్రతి చోటా నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. 20 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ కవర్లపై పూర్తిస్థాయిలో నిషేధం ఉన్నప్పటికీ, మార్కెట్‌లో ఇవే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.

పశువుల పాలిట శాపం

ప్రజలు ఇళ్లలోని తడి చెత్తను, మిగిలిపోయిన ఆహార పదార్థాలను ప్లాస్టిక్‌ కవర్లలో కట్టి రోడ్లపై, మురికికాల్వల్లో పారేస్తున్నారు. ఆహారం కోసం వెతికే మూగజీవాలైన ఆవులు, గేదెలు ఆ కవర్లతో సహా తినేస్తున్నాయి. దీంతో అవి అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయి. అంతేకాకుండా, ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలు కాల్వల్లో ఇరుక్కుపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.

టాస్క్‌ఫోర్స్‌ కమిటీల చర్యలేవి..

ప్లాస్టిక్‌ వస్తువుల నియంత్రణకు, పర్యవేక్షణకు మున్సిపల్‌ పరిధిలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌, శానిటరీ విభాగాల అధికారులు ఉండాలి. వీరు నిరంతరం మార్కెట్లు, హోల్‌సేల్‌ వ్యాపార కేంద్రాలపై దాడులు నిర్వహించి ప్లాస్టిక్‌ నిల్వలను సీజ్‌ చేయడంతోపాటు భారీగా జరిమానాలు విధించాల్సి ఉంటుంది. కానీ కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీల హడావుడి కనిపించడం లేదు. పర్యావరణ దినోత్సవం వస్తే తప్ప మున్సిపల్‌ సిబ్బందికి ప్లాస్టిక్‌ తనిఖీలు గుర్తుకురావని పురప్రజలు పెదవి విరుస్తున్నారు.

జరిమానాలు ఎక్కడ?

నిబంధనల ప్రకారం నిషేధిత ప్లాస్టిక్‌ వాడే వ్యాపారులకు మొదటిసారి రూ. 2,500, రెండోసారి రూ. 5,000, మూడోసారి అంతకన్నా ఎక్కువ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంది. అవసరమైతే దుకాణాల లైసెన్సు కూడా రద్దు చేయవచ్చు. కానీ, అధికారుల ఉదాసీనతతో వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేవలం చిరువ్యాపారులపైనే ప్రతాపం చూపే అధికారులు.. హోల్‌సేల్‌గా ప్లాస్టిక్‌ సరఫరా చేసే పెద్ద వ్యాపారుల జోలికి వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్‌ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు చేపట్టాలని, తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మున్సిపాలిటీ చెత్త(టన్నుల్లో) నిషేధిత

ప్లాస్టిక్‌ (కేజీల్లో)

కామారెడ్డి 40–45 1800–2200

బాన్సువాడ 18–20 800–1000

ఎల్లారెడ్డి 10–12 400–500

బిచ్కుంద 08–10 350–450

జిల్లాలోని పురపాలికల్లో ప్లాస్టిక్‌ నిషేధం నామమాత్రంగా జరుగుతోంది. రోజురోజుకూ తగ్గాల్సిన వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపంతోనే నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాస్‌లు, టీ కప్పుల విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నాయి. నియంత్రించాల్సిన అధికారుల చర్యలు కాగితాలకే పరిమితం కావడంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. – కామారెడ్డి టౌన్‌

యథేచ్ఛగా ప్లాస్టిక్‌ వాడకం

బల్దియాల్లో కంటితుడుపుగా తనిఖీలు

నిషేధిత కవర్ల విక్రయాలు జోరు

పర్యావరణానికి తీవ్ర విఘాతం

టాస్క్‌ఫోర్స్‌ కమిటీల స్పందన కరువు

పట్టింపులేని బల్దియా అధికారులు

నిషేధిత, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతాం. ఇప్పటికే శానిటరీ విభాగం ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి హోల్‌సేల్‌ వ్యాపార కేంద్రాలు, గోదాములపై దాడులు చేస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవు. వ్యాపారులు, ప్రజలు సహకరించి ప్లాస్టిక్‌ వినియోగం మానుకోవాలి. – టి. పర్వతాలు, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement