సాగునీటికి అత్యంత ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

సాగునీటికి అత్యంత ప్రాధాన్యత

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌కు

అదనంగా రూ.200 కోట్లు

భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తవ్‌ుకుమార్‌ రెడ్డి

జాకోరా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌షెట్కార్‌

వాహనంలో ప్రయాణిస్తూ సిద్ధాపూర్‌

రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్‌

వర్ని: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వర్ని మండలం జాకోరలో రూ.106 కోట్ల వ్యయంతో నిర్మించిన జాకోరా, చందూర్‌ లిఫ్ట్‌లను మంత్రి బుధవారం ప్రారంభించారు. హెలీకాప్టర్‌లో సిద్ధాపూర్‌కు చేరుకున్న మంత్రికి ప్రభుత్వ సలహాదారు పో చారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌షెట్కార్‌, కలెక్టర్‌ ఇ లా త్రిపాఠి తదితరులు స్వాగతం పలికారు. సిద్ధాపూ ర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. జాకోరాకు చేరుకుని అక్కడ జాకోరా, చందూర్‌ లిఫ్ట్‌లను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. నిజాంసాగర్‌ కాలువ ఎగువ భాగాన ఉన్న రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో జాకోరా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను నిర్మించామన్నారు. లిఫ్ట్‌ ద్వారా 7,975 ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. నిజాంసాగర్‌ ప్రధాన కాలువపై సొలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ పనులను పూర్తి చేసేందుకు మరో రూ.200 కోట్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టులు కూలిపోయాయని, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్‌ ప్రకారం మూడు ప్రాజెక్టులను పునర్నిర్మిస్తామన్నారు. రూ. లక్షల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వ హయాంలో రైతులకు ప్రయోజనం జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో విద్య, వైద్యం, తాగు నీరు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement