‘ఉపాధి’కి పెరిగిన డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి పెరిగిన డిమాండ్‌

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

పనుల సంఖ్య పెంచాం

నెలక్రితం రోజుకు

23 వేల మంది హాజరు

ప్రస్తుతం 60 వేలకు పెరిగిన సంఖ్య

దోమకొండ: జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్‌ పెరిగింది. నెల క్రితం రోజూ 23 వేల మంది పనులకు వచ్చేవారు. ఇప్పుడా సంఖ్య 60 వేలకు చేరడం గమనార్హం. మే నెలలో వ్యవసాయ పనులు లేకపోవడంతో చాలామంది ఉపాధి హామీ పనులకు రావడానికి మొగ్గు చూపుతున్నారు. మే నెల మొదటి వారంలో 23 వేల మంది మాత్రమే పనులు చేసేవారు. ఇది క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండో వారంలో 35,047 మంది ఉపాధి పనులకు రాగా.. మూడో వారంలో 41,280 మంది, నాలుగో వారంలో 54,052 మంది పనులు చేసినట్లు ఉపాధి హామీ పథకం అధికారులు తెలిపారు. కాగా ఈనెల మొదటివారంలో 60 వేలకుపైగా మంది పనులకు వచ్చారని పేర్కొన్నారు. కాగా ఉపాధి హామీ పథకం ఈనెలాఖరు వరకు కొనసాగనుంది. వచ్చేనెల ఒకటో తేదీనుంచి వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, ఆజీవిక మిషన్‌ (వీబీ జీరామ్‌జీ) అమలులోకి రానుంది. అయితే కొత్త చట్టం విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

వ్యవసాయ సీజన్‌ పనులు పూర్తయిన తర్వాత ఉపాధి హామీ పనులకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. మండలంలో నిత్యం రెండువేలకు పైగా కూలీలు పనులకు వస్తున్నారు. వారికి తగ్గట్టుగా పనుల సంఖ్యను పెంచాం. పనులను పర్యవేక్షిస్తూ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

– ప్రవీణ్‌కుమార్‌, ఎంపీడీవో, దోమకొండ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement