● ఇద్దరి అరెస్ట్..
10 కిలోల గంజాయి స్వాధీనం
కామారెడ్డి క్రైం: రైలులో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని కామారెడ్డి రైల్వే, ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం గుర్తించి పట్టుకున్నారు. సీఐ సంపత్ కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంబల్‌పూర్ నుంచి పుణే వెళ్తున్న నాగవలి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు కామారెడ్డి స్టేషన్‌లో రైలు ఆగగానే పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి 10 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్, ప్రవీణ్‌గా గుర్తించారు. వారు ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌ఘడ్ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి రైలులో మహారాష్ట్ర లోని రాయ్‌పూర్‌కు రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని సీఐ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై విక్రమ్, హెడ్ కానిస్టేబుళ్లు జాన్, బల్వంత్‌రావు, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.


