గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

గాంధారి/బాన్సువాడ: గాంధారి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ రఘు(45) గుండెపోటుతో మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. బాన్సువాడ పట్టణానికి చెందిన రఘు గత కొంత కాలంగా గాంధారి పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బాన్సువాడలోని ఇంటికి వచ్చిన రఘు మంగళవారం ఉదయం విధి నిర్వహణ కోసం గాంధారికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అస్వస్తతకు గురయ్యాడు. గమనించిన కుంటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, 12ఏళ్ల లోపు వయస్సున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement