ఆత్మస్థైర్యం స్వీయ రక్షణ | - | Sakshi
Sakshi News home page

ఆత్మస్థైర్యం స్వీయ రక్షణ

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

కరాటేతో ఆత్మ విశ్వాసం

నాయకత్వ లక్షణాలు అలవర్చాలి

చిట్టి చేతులతో కరాటే పంచ్‌లు

ఉత్సాహంగా నేర్చుకుంటున్న చిన్నారులు

బాన్సువాడ : ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవడంతోపా టు స్వీయరక్షణ కోసం చిన్నారులు వేసవి సెలవుల్లో కరాటే శిక్షణ పొందుతున్నారు. శారీరక దృఢత్వం.. క్రమ శిక్షణ అలవడేలా సెలవులు సద్వినియోగమ వుతున్నాయి. బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వా మి ఆలయం ప్రాంగణంలో చిన్నారులు కరాటేలో శిక్షణ క్లాస్‌లు కొనసాగుతున్నాయి. మండలంలోని సంగోజిపేట్‌ గ్రామానికి చెందిన మాగి నవీన్‌ అనే యువకుడు హైందవ వీరుల యుద్ధ కలల గురుకులం (అకాడమీ ది రైట్‌ వే కరాటే క్యాంపస్‌) అనే శిక్షణ తరగతులను ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. వేసవి సెలవులు వృథా చేయకుండా, సెల్‌ఫోన్‌లకు పరిమితం కాకుండా కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు. గత నెల 1వ తేదీన శిక్షణ తరగతులను ప్రారంభం కాగా, బుధవారం నాటితో ముగియనున్నాయి. మొదట్లో 8 మంది పిల్లలతో శిక్షణ క్లాస్‌లు ప్రారంభం కాగా, ఆ సంఖ్య 60కి చేరిందని నవీన్‌ తెలిపా రు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వర కు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు చిన్నారులకు కరాటే శిక్షణ కొనసాగింది. చిన్నారులు తమ చిట్టి చేతులతో ఇస్తున్న కరాటే పంచ్‌లను చూస్తూ స్థానికులు అభినందిస్తున్నారు.

కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగు తుంది. ఏదైనా సాధించొచ్చనే నమ్మకం కలు గు తుంది. అమ్మనాన్నలు కరాటే శిక్షణ అంటే ఆనందంతో పంపుతున్నారు. వేసవి సెలవులు వృథా కా కుండా శిక్షణ ఉపయోగపడుతోంది. నవీన్‌ మాస్టారుకు ప్రత్యేక ధన్యవాదాలు. – వైష్ణవి, బాన్సువాడ

కరాటేతో ఆరోగ్యం సొంతమవుతుంది. ఆత్మస్థైర్యం, నాయకత్వ లక్షణాలు అవలవడుతాయి. వేసవి సెలవుల్లో పిల్లల కోసం ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశాం. ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం ఆనందాన్ని ఇస్తోంది. పిల్లలు కూడా ఉత్సాహంగా వస్తున్నారు. – నవీన్‌, శిక్షకుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement