● బీబీపేట బాలుర పాఠశాల నుంచి ఎనిమిది మంది ఎంపిక
● జిల్లాలో మొదటి స్థానం
బీబీపేట : బీబీపేట బాలుర పాఠశాల నుంచి ఇటీవ ల ప్రకటించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్)లో ఎనిమిది మంది వి ద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విభాగంలో ఈపాఠశాల జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2025, 2024లల్లో ఈ పాఠశాల నుంచి ఇద్దరేసి వి ద్యార్థులు ఎంపికయ్యారు. నేషనల్ మీన్స్ కమ్ మె రిట్ స్కాలర్‌షిప్ ఆర్థికంగా వెనుకబడిన, చదువులో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉన్నత విద్య కొనసా గించడానికి ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష. టీఎస్‌ఎన్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన ఎనిమిదో తరగతి వి ద్యార్థులు మామిడాల సృజన, రేగుల కార్తిక, ధర్మ గారి అచ్యుత్‌గౌడ్, శివంది నాగప్రసన్న, పెద్దోళ్ల మ నుశ్రీ, నీరడి రుచిత, కొత్తకోట సంయుక్త, వల్లెపు లాస్యలు ఇటీవల నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ ఎంట్రన్స్ పరీక్షకు ఎంపికయ్యా రు. ఎంపికై న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 9వ త రగతి నుంచి 12 వ తరగతి వరకు ప్రతి సంవత్సరా నికి గానూ రూ.12 వేలు అందిస్తారు. పాఠశాల ఉ పాధ్యాయులు విద్యార్థులలో ఉన్నటువంటి ప్రతిభ ను గుర్తించి ప్రత్యేక ప్రణాళికతో ప్రతిరోజు అదనపు శిక్షణ తరగతులు నిర్వహించారు. గత ప్రశ్నాపత్రాలపై సాధన చేయించడం, వ్యక్తిగతంగా వచ్చిన సందేహాలను నివృత్తి చేయడంతో విద్యార్థులు ఈ పరీక్షలో మంచి ఫలితాలను సాధించారు.


