నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలుగ్రామాల్లో మంగళవారం అధికారులు పూరిగుడిసెల సర్వే చేపట్టారు. ఈ క్రమంలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పూరిగుడిసెల సర్వే చేపట్టినట్లు ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మండలంలోని వదల్‌పర్తిలో జరిగిన పూరిగుడిసెల సర్వేను ఎంపీడీవో పరిశీలించారు. జీపీ కార్యదర్శి అశోక్ ఉన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : మండలంలోని గోపాల్‌పేటకు చెందిన కబడ్డీ క్రీడాకారులకు మంగళవారం బీజేపీ మండల నాయకురాలు మీరాతాయి క్రీడాదుస్తులను అందజేశారు. గోపాల్‌పేటకు చెందిన క్రీడాకారులు తాడ్వాయిలో జరుగుతున్న కబడ్డీ పోటీలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పోటీలో పాల్గొనే క్రీడాకారులకు క్రీడాదుస్తులను ఆమె అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యులు హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రీజినల్ చైర్మన్‌గా శెనిశెట్టి గౌరీ శంకర్ నియామకమయ్యారు. మంగళవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు కై లాస్ శ్రీనివాస్‌రావు తదితరులున్నారు.
కామారెడ్డి క్రైం : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) కామారెడ్డి జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను ఈనెల 11 న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నట్టు ఎన్నికల అ ధికారి లస్కర్ సత్యనారాయణ మంగళవారం ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా కార్యవర్గంలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారితో పాటు, మూడు చొప్పున ఉపాధ్యక్షులు, సంయుక్త కా ర్యదర్శుల పదవులు, 13 కార్యవర్గ సభ్యుల ప దవులు ఉంటాయని వెల్లడించారు. దాంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గానికి సైతం నామినేషన్లు స్వీకరించనున్నామని పే ర్కొన్నారు. అవసరాన్ని బట్టి ఈ నెల 12న సా యంత్రం జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో ఉన్న వరలక్ష్మి గార్డెన్‌లో జరిగే జిల్లా సా ధారణ సర్వసభ్య సమావేశంలో భాగంగానే ఎన్నికల నిర్వహణ, తుది ఫలితాల వెల్లడి ఉంటాయన్నారు. ఆసక్తి గల టీయూడబ్ల్యూజే స భ్యులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చన్నారు.
రుద్రూర్: ట్రాక్టర్ బంపర్ తగిలి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గంగారాం తన ట్రాక్టర్‌కు కల్టివేటర్‌ను తగిలించేందుకు వాహనాన్ని వెనుకకు తీస్తుండగా, అక్కడే ఆడుకుంటున్న అతని మనవరాలు మహాన్విక (2)కు బంపర్ తగిలింది. ఈ ఘటనలో చిన్నారికి తలకు తీవ్ర గాయం కాగా, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


