హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుంది | - | Sakshi
Sakshi News home page

హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుంది

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

కాంగ్రెస్‌, బీజేపీలు రైతులను

మోసం చేస్తున్నాయి

బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌రూరల్‌/డిచ్‌పల్లి : నియంత హిట్లర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్‌లో మంగళవారం నిర్వహించిన నిజామాబాద్‌ రూరల్‌నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు, సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సిస్‌ రివిజన్‌) సన్నాహక సమావేశానికి ప్రశాంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారే నిజమైన కార్యకర్తలని అన్నారు. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేపడితే పార్టీ బలపడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు తోడుదొంగలని, ఆ రెండు పార్టీలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. యూరియా కొరత వల్ల రైతుల కడుపు మండుతోందని, తక్షణమే యాప్‌ విధానాన్ని రద్దు చేసి పాతపద్దతిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. యాప్‌ పోవాలి.. బాపు రావాలి.. అని రైతులు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎవ్వరూ కూడా తెలంగాణపై మాట్లాడలేదని, ప్రస్తుతం ఆంధ్రాగద్దల కన్ను తెలంగాణపై పడుతోందని, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చంద్రబాబు అండ చూసుకుని తెలంగాణకు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడి ప్రజలు చూస్తు ఊరుకోబోరని హెచ్చరించారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి వీ గంగాధర్‌గౌడ్‌ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, హన్మంత్‌సింధే, జాజాల సురేందర్‌ తదితరులు ప్రసంగించారు. ప్రసంగించారు. రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రతినిధుల సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో రెండు ముఖ్యమైన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. యాప్‌ విధానాన్ని రద్దు చేసి అన్ని సొసైటీల ద్వారా రైతులకు నేరుగా యూరియా అందేలా చర్యలు చేపట్టాలని, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ను తక్షణమే పునరుద్దించాలని తీర్మానించారు. పార్టీ సీనియర్‌ నాయకుడు, సభ్యత్వ నమో దు ఇన్‌చార్జి గిర్దావర్‌ గంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్‌, దాసరి ఇందిర, పాట్కూరి తనూజ, గడ్డం సుమనరెడ్డి హాజరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement