రీజియన్‌ అభివృద్ధికి కృషి చేశాం | - | Sakshi
Sakshi News home page

రీజియన్‌ అభివృద్ధికి కృషి చేశాం

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

నిజామాబాద్‌ రూరల్‌ : ఆర్టీసీ నిజామాబాద్‌ రీజియన్‌ అభివృద్ధికి విశేష కృషి చేశామని ఆర్‌ఎం టి జ్యోత్స్న అన్నారు. బదిలీపై నల్గొండ జిల్లాకు వెళ్తున్న ఆర్‌ఎంను, డిప్యూటీ ఆర్‌ఎంగా మెదక్‌ రీజియన్‌కు పదోన్నతిపై వెళ్తున్న మధుసూదన్‌ను అధికారులు, సిబ్బంది జిల్లా కేంద్రంలోని రీజియన్‌ కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. రీజియన్‌ అభివృద్ధికి విశేష కృషి చేశామని, ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో సిబ్బంది కీలకపాత్ర పోషించారని కొనియాడారు.

భవిష్యత్‌లో సైతం సంస్థ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోల మేనేజర్లు, సూపర్‌వైజర్లు, మెకానికల్‌ ఫోర్‌మెన్‌లు, రీజియన్‌ పీవో పద్మజ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement