కామారెడ్డి టౌన్ : మున్సిపాలిటీ పరిధిలో రూ.90 లక్షలకు పైగా విలువైన ప్రభుత్వ ఆస్తులు, స్క్రాప్ సామగ్రిని అక్రమంగా విక్రయించారని, దీనిపై స మగ్ర విచారణ జరిపి బాధ్యులను అరెస్ట్ చేయాలని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్‌చంద్ర, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మా ట్లాడుతూ 2024 డిసెంబర్ 10న రాత్రి వాటర్ ఫిల్టర్ బెడ్ గోదాం, బుర్ర మత్తడి, పెద్ద చెరువు, జా తీయ రహదారి పక్కన నిల్వ ఉంచిన ప్రభుత్వానికి చెందిన పాత మోటార్లు, కాపర్ వస్తువులు, విలువై న స్క్రాప్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలించి విక్రయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి మున్సిపల్ చైర్‌పర్సన్ పాత్రపై పత్రికల్లో కథనాలు వచ్చాయని, వాటర్ వ ర్క్స్ ఉద్యోగి ఇచ్చిన వాంగ్మూలం కూడా ఇందుకు బలపరుస్తోందన్నారు. గతంలో తాము ఫిర్యాదు చే సినా అధికారులు చర్యలు తీసుకోలేదని, జిల్లా స్థా యి ఉన్నతాధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐరేనీ సందీప్, కౌన్సిలర్లు, నాయకులు కళ్లెం సావిత్రి, అంజాద్, లడ్డు, కాళ్ల రాజమ ణి, వనిత, ఫాతిమా, గ్యా ర అఖిల, గంగాధర్, సునీత, తహసీన్ ఉన్నిసా, వా జిద్, ఆఫ్రిన్, ఆస్మా హబీబ్, సుల్తానా బేగం, లలిత, ఇసాక్ షేరు, అన్వర్ అహ్మద్, గోనె శ్రీనివాస్, ము బాషిర్, గణేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.


