యూరియా కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం ఆందోళన

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

సదాశివనగర్‌: అప్పుడే రైతన్నకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో మంగళవారం పద్మాజీవాడి సింగిల్‌ విండో కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి రైతులకు టోకెన్లను అందించి యూరియాను పంపిణీ చేశారు. యూప్‌లో బుక్‌ చేసుకున్న వారందరికీ అందేలా చూస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. విషయం తెలుసుకున్న జిల్లా సహకార అధికారి రామ్మోహన్‌ ఏవో ప్రజాపతి, విండో సీఈవో దేవేందర్‌లతో మాట్లాడి యూరియా స్టాక్‌ వివరాలను తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియాను పంపిణీ చేస్తున్నామని విండో చైర్మన్‌ గంగాధర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement