నిజాంసాగర్: మహమ్మద్ నగర్ మండలంలోని శేర్‌ఖాన్‌పల్లి, సింగితం, తెల్గాపూర్ గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి జొన్నలు తడిసిపోయాయి. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన జొన్నలు అలాగే ఉన్నాయి. ఇంకా కాంటా వేయాల్సినవి కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. భారీ వర్షం కురియడంతో కుప్పల చుట్టూ నీరు నిలిచింది. బస్తాలూ తడిచిపోయాయి. శేర్‌ఖాన్‌పల్లి శివారులో తడిసిన జొన్న బస్తాలను సర్పంచ్ సాయమ్మ, జీపీవో గోవర్ధన్ పరిశీలించారు. కొనుగోళ్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.


