నిజామాబాద్‌అర్బన్: నేరాలు, నేరస్తుల సమాచా రాన్ని సీసీ టీఎన్‌ఎస్ 2.0 (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్)ద్వారా వేగవంతంగా నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించా రు. సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. దర్యాప్తు ప్రక్రియను డిజిటలైజ్ చేయడం ప్రజలకు అందించే సేవలను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చడంపై దిశా నిర్దేశం చేశారు. ఈ – సాక్ష్య వ్యవస్థ ద్వారా నేర సంఘటనలకు సంబంధించి డిజిటల్ ఆధారాలను సేకరించడం భద్రత పరచడం, కోర్టు విచారణలో సమర్పించే విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడం, సేవల్లో నాణ్యతను పెంపొందించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు, ఇన్‌చార్జి సీపీ రాజేశ్‌చంద్ర, అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్ ట్రాఫిక్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.


