స్కేటింగ్‌ నేర్చుకున్నా.. | - | Sakshi
Sakshi News home page

స్కేటింగ్‌ నేర్చుకున్నా..

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

హాయ్‌ ఫ్రెండ్స్‌... నా పేరు డీజీ అన్విక్ష్‌ భీమ్‌. నా స్వగ్రామం వేల్పూర్‌. వేసవి సెలవుల్లో నిజామాబాద్‌లో ఉండే అమ్మమ్మ దగ్గరికి వచ్చాను. ఇక్కడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కేటింగ్‌ శిక్షణలో పాల్గొంటున్నాను.

మొదటిసారి స్కేటింగ్‌ షూస్‌ ధరించినప్పుడు కొంచెం భయంగా అనిపించింది. కానీ ప్రతిరోజూ సాధన చేయడంతో, ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా స్కేటింగ్‌ చేస్తున్నాను. వేసవి సెలవులను ఆనందంగా, ఉపయోగకరంగా గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement