ఇసుక వ్యాపారులకు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక వ్యాపారులకు నోటీసులు

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

ఇసుక వ్యాపారులకు నోటీసులు 8 ప్రీప్రైమరీ స్కూల్స్‌ మంజూరు పాఠ్యపుస్తకాల పంపిణీ

భిక్కనూరు: మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు మండల రెవెన్యూ అధికారులు సోమవారం నోటీసులు జారీచేశారు. అక్రమ దందాపై ‘సాక్షి’ దినపత్రికలో జోరుగా ఇసుక అక్రమ దందా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన అధికారులు మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు నోటీసులను జారీచేశారు. అనుమతులు లేకుండా ఇసుక వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని నోటీసులో హెచ్చరించారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలానికి 2026–27 విద్యాసంవత్సరానికిగాను ఎనిమిది ప్రీప్రైమరీ సెక్షన్స్‌ పాఠశాలలు మంజూరు అయినట్లు ఎంఈవో యూసెఫ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సదాశివనగర్‌,ఽ ధర్మారావుపేట్‌, అడ్లూర్‌ఎల్లారెడ్డి, భూంపల్లి, లక్ష్మీనాయక్‌తండా, తిర్మన్‌పల్లి, కల్వరాల్‌, తిమ్మోజివాడిలలో పాఠశాలలు ఎంపికై నట్లు తెలిపారు. ఈ పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేయడానికి ఇంటర్మీడియట్‌, ఆయాలుగా పనిచేయడానికి 7వ తరగతి వరకు చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తిగలవారు ఆయా పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులకు మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 15 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి):మండల కేంద్రంలోని ఎ మ్మార్సీ భవనంలో సోమవారం ఉపాధ్యాయులకు పాఠ్య పుస్తకాలను ఎంఈవో రామస్వామి పంపిణీ చేశారు. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవివే విద్యార్థుల కోసం 11,417 పుస్తకాలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు, మూడు రోజులలో సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలకు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 15న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని అదేరోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. సర్పంచ్‌ విజయరాములు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement