బైక్ అదుపు తప్పి ఒకరి మృతి
నవీపేట : మండలంలోని అంజుమన్ ఫా రం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీపేట్‌కు చెందిన మహ్మ ద్ గౌస్(30) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. నిజామాబాద్ మండలం పాల్ద గ్రామంలోని అత్తగారింటికి బైక్‌పై వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడడంతో గౌస్ తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడని తెలిపారు.
బైక్‌ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో మరొకరు..
ఇందల్వాయి: బైక్‌ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై సుమలత తెలిపిన వివరాలు.. తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఎరుకల పోశయ్య (82) ఇందల్వాయి నుంచి సోమవారం సాయంత్రం తన స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ఇందల్వాయి నుంచి ధర్పల్లి వైపు వెళ్తున్న టిప్పర్ ఢీట్టింది. తీవ్ర గాయాలపాలైన పోచయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడు రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ..
నాగిరెడ్డిపేట: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన దూదేకుల అజీమ్ (73) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నడుచుకుంటూ వెళ్తు న్న అజీమ్‌ను వెనక నుంచి ఆటో ఆదివారం ఢీకొట్టిందన్నారు. గాయాలపాలైన అజీమ్ మెదక్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతు సోమవారం మృతి చెందాడని తెలిపారు. ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


