మోపాల్: మోపాల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఏ గంగాధర్ (52) గుండెపోటుతో మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌కు చెందిన ఏ గంగాధర్ 1998లో పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం మోపాల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం విధుల్లో భాగంగా మండలంలోని గుడితండాలో నిర్వ హించిన గ్రామసభకు హాజరయ్యాడు. విధులు పూర్తి చేసుకుని మధ్యా హ్నం సమయంలో నగరంలోని రోటరీనగర్‌లోగల తన ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో భార్య, కుమారుడు ఖలీల్‌వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తు న్న క్రమంలోనే తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యబృందం అత్యవసర చికిత్సతోపాటు సీపీఆర్ చేసినప్పటికీ ఆయ న స్పందించలేదు. తీవ్రమైన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గంగాధర్ కుమారుడు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలిసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటు న్న ఆ కుటుంబానికి కుటుంబ పెద్ద కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. కాగా గంగాధర్ ఆకస్మిక మరణం పోలీస్‌శాఖకు తీరని లోటు అని, అంకితభావంతో విధులు నిర్వహించిన పోలీసు అని సీఐ సురేష్‌కుమార్, ఎస్సై సుస్మిత పేర్కొన్నారు. ఆయన మృతికి వారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గంగాధర్ అంత్యక్రియలు బషీరాబాద్‌లో మంగళవారం నిర్వహించనున్నట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది.


