వేతనాలు ఇక్కడ! | - | Sakshi
Sakshi News home page

వేతనాలు ఇక్కడ!

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

సేవలక్కడ వేతనాలు ఇక్కడ!

ఇన్‌చార్జి బాధ్యతలు..

డిప్యుటేషన్లు రద్దు చేయాలంటున్న పశుపోషకులు

సేవలక్కడ

ఎల్లారెడ్డి పశువుల ఆస్పత్రి

ల్లారెడ్డిలోని డివిజన్‌ స్థాయి పశు వైద్యశాలలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుతోపాటు ఒక వెటర్నరీ అసిస్టెంట్‌, రెండు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులున్నాయి. ఈ ఆస్పత్రికి ఏడీగా 2024 ఆగస్టులో బదిలీపై వచ్చిన ఉద్యోగి.. నెల రోజులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఎక్కడో దూరంగా ఉన్న నారాయణపేట జిల్లాకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అప్పటినుంచి అక్కడే సేవలందిస్తున్న ఆయన.. వేతనం మాత్రం ఎల్లారెడ్డిలో పొందుతుండడం గమనార్హం.

ఇదే ఆస్పత్రికి చెందిన వెటర్నరీ అసిస్టెంట్‌ సైతం డిప్యుటేషన్‌పై తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌ పశువుల ఆస్పత్రి వెళ్లడం గమనార్హం. ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఏడాదిన్నరగా నిజాంసాగర్‌ పశువుల ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇలా రెగ్యులర్‌ ఉద్యోగులు తమకు అనువైన స్థానాలకు డిప్యుటేషన్‌పై వెళ్లగా.. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఆఫీస్‌ సబార్డినేట్‌(అటెండర్‌) మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. రెగ్యులర్‌ పోస్టింగ్‌ ఉన్న స్థానంలో ఉద్యోగుల కొరత ఉన్నా అందరూ డిప్యుటేషన్లపై వెళ్లడం, అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వైద్యులు లేకపోవడంతో అటెండరే తనకు తెలిసిన అరకొర వైద్య సేవలు అందిస్తున్నారు.

మత్తమాల పశువైద్యాధికారిపై భారం..

మత్తమాలలో పనిచేస్తున్న పశువైద్యురాలికి మండలంలోని వెల్లుట్ల పశువుల ఆస్పత్రి ఇన్‌చార్జి బాధ్యతలతోపాటు ఎల్లారెడ్డి ఆస్పత్రి బాధ్యతలూ అప్పగించారు. మండలంలోని రెండు పశువుల ఆస్పత్రులతో పాటు అదనంగా ఎల్లారెడ్డిని కూడా అప్పగించడంతో ఆమైపె అదనపు భారం పడుతోంది. అయినా పశువులకు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు అత్యవసరమైతే ఎల్లారెడ్డికి వచ్చి సేవలందిస్తున్నారు.

ఎల్లారెడ్డి ఆస్పత్రి వైద్యుడు డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఇక్కడ ఇన్‌చార్జి ఏడీ బాధ్యతలను నాగిరెడ్డిపేట వైద్యుడికి అప్పగించారు. అయితే సొంత మండలంలో సేవలందించడానికే ఎక్కువ కేటాయించాల్సి వస్తుండడంతో ఆయన చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారని పశుపోషకులు అంటున్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర సమావేశాలకు మాత్రమే ఆయన హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

ఎల్లారెడ్డి ఆస్పత్రిలో సేవలందించేందుకు ని యమితులైన వైద్యులు తమకు అనువైన ప్రాంతాల కు డిప్యుటేషన్‌ వేయించుకుని వెళ్లడంతో పశువుల కు సకాలంలో సరైన వైద్య సేవలు అందడం లేదు. దీంతో పశుపోషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యుటేషన్లను రద్దు చేసి ఎక్కడి వైద్యులకు అక్కడికి పంపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా డిప్యుటేషన్లపై ‘సాక్షి’ జిల్లా పశువైద్యాధికారి(డీవీఏహెచ్‌వో) భరత్‌ను వివరణ కోరగా జిల్లాలో పశువైద్యులు, సిబ్బంది కొరత త్వరలోనే తీరుతుందన్నారు. ఎల్లారెడ్డి ఆస్పత్రికి కూడా సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమిస్తామన్నారు.

ఎల్లారెడ్డిలోని డివిజన్‌ స్థాయి పశు వైద్యశాలలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులంతా డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో స్థానికంగా పశువులకు సరైన సేవలు అందడం లేదు. దీంతో పశుపోషకులు ఇబ్బందిపడుతున్నారు. – ఎల్లారెడ్డి

అనువైన ప్రాంతాలకు

ఉద్యోగుల డిప్యుటేషన్‌

సమావేశాలకే

పరిమితమవుతున్న ఇన్‌చార్జి..

ఎల్లారెడ్డి పశువుల ఆస్పత్రిలో

అందని వైద్యసేవలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement