సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం | - | Sakshi
Sakshi News home page

సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

జిల్లా కేంద్రంలో ‘ఫిట్‌ ఇండియా

మూవ్‌మెంట్‌’ సైకిల్‌ ర్యాలీ

కామారెడ్డి టౌన్‌ : సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం లభిస్తుందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో సైక్లింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ప్రపంచ సైకిల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో ‘ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌‘ ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్‌ ర్యాలీలో కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గిరి పాల్గొని సైకిల్‌ తొక్కారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆధునిక కాలంలో యాంత్రిక జీవనశైలి వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సైక్లింగ్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సైక్లింగ్‌ చేయడం వల్ల శారీరక దృఢత్వం పెంపొందడమే కాకుండా కాలుష్య నియంత్రణలోనూ భాగస్వాములం కావొచ్చన్నారు. యువత, విద్యార్థులు బైక్‌లపై చూపించే శ్రద్ధను సైక్లింగ్‌పై పెట్టాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దామోదర్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement