కామారెడ్డి అర్బన్: ధరణి టౌన్‌షిప్ పేరుతో నాలుగేళ్ల క్రితం ప్లాట్లు విక్రయించిన ప్రభుత్వం.. అందులో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని రాజీవ్ స్వగృహ ధరణి టౌన్‌షిప్ బాధితుల సంఘం అధ్యక్షుడు రాజనర్సింహారెడ్డి విమర్శించారు. ఆదివారం కామారెడ్డి శుభం కన్వెన్షన్ ప్రాంగణంలో గౌరవ అధ్యక్షుడు కై లాస్ రాజేశ్వర్‌రావుల సమక్షంలో టౌన్‌షిప్ బాధితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజనర్సింహారెడ్డి మాట్లాడుతూ టౌన్‌షిప్‌లో సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబితే ఇళ్లు, ప్లాట్లు కొనుక్కున్నామని, ఇప్పటివరకు రోడ్డు, విద్యుత్, నీటి సరఫరా వంటి కనీస మౌలిక సౌకర్యాలేవీ కల్పించలేదని పేర్కొన్నారు. మాట తప్పిన ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో ప్లాట్ల కొనుగోలుదారులు జస్వంత్‌రావు, చీల శ్రీనివాస్, కేదార్, భుజంగరావు, వెంకటరాములు, చక్రం, చంద్రయ్య, శ్రీనాథ్, శ్రీనివాస్, శివరాజయ్య, రాజ్‌గంభీర్‌రావు, శ్రీధర్, లక్ష్మీనారాయణ, నవీన్‌కుమార్, శ్రీనాథ్, వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు.


