అలరించిన ఆర్కెస్ట్రా బృంద ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

అలరించిన ఆర్కెస్ట్రా బృంద ప్రదర్శన

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

డిచ్‌పల్లి: మండలంలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడవ బెటాలియన్‌లో నూతనంగా ఏర్పాటైన ఆర్కెస్ట్రా బృందం ఆదివారం నిర్వహించిన ప్రదర్శన ఎంతో అలరించింది బెటాలియన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన తమ సంగీత ప్రదర్శనతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. వారు పాత, కొత్త సినీ మధుర గీతాలను ఆలపిస్తూ, దానికి తగ్గట్టుగా వాయిద్యాలను వాయిస్తూ అందరినీ ఆశ్చ ర్యంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా బెటాలియ న్‌ కమాండెంట్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. బృందాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు గానూ ఇన్‌చార్జి 8వ బెటాలియన్‌ కమాండెంట్‌ రామకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీసుల విధుల్లో ఉండే ఒత్తిడిని దూరం చేయడానికి, సిబ్బంది మానసిక ఉల్లాసానికి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని కమాండెంట్‌ పేర్కొన్నారు. అసిస్టెంట్‌ కమాండెంట్లు శ్రీనివాస్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement