ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు | - | Sakshi
Sakshi News home page

ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు

నిర్వహించిన పూర్వవిద్యార్థులు

ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో

భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు

సాక్షి నెట్‌వర్క్‌: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement