● చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్
● విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ సేవలను విస్తరిస్తామని చైర్మన్ బొమ్మ శ్రీరా మ్ చక్రవర్తి పటేల్ అన్నారు. నగరంలోని ప్రగతిన గర్ మూన్నూరుకాపు సంఘంలో ఆదివారం ప్రభు త్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థులకు ‘ప్రతిభా పు రస్కారాలు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడా రు. ప్రతి జిల్లాలోని సంఘ కార్యాలయాల్లో, కల్యా ణ మండపాల్లో కార్పొరేషన్‌కు సంబంధించిన స మాచారాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. కాపు సోదరుల కుటుంబాల అభ్యున్నతికి జిల్లా క మిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసపత్రంతో గోల్డ్ మెడల్ శాలువాతో సత్కరించారు. సభాధ్యక్షులుగా తోట రాజశేఖర్, ప్రతినిధులు అబ్బపూర్ రవీందర్, బుస్స ఆంజనేయులు. నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ రాంభూపాల్, బొబ్బిలి నర్స య్య, గోపి, సురేష్ పాల్గొన్నారు.


