మహిళల సంక్షేమమే సమాజ ప్రగతి | - | Sakshi
Sakshi News home page

మహిళల సంక్షేమమే సమాజ ప్రగతి

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

కామారెడ్డి టౌన్‌ : మహిళల భద్రత, బాలల సంక్షేమమే సమాజ ప్రగతికి బలమైన పునాదని ఏహెచ్‌టీయూ(యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌) ఎస్సై ఉస్మాన్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని లేబర్‌ అడ్డాలో ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌, జిల్లా ఏహెచ్‌టీయూ బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు కళాబృందం ఆటపాటలతో సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100, 112, సైబర్‌ నేరాల కోసం 1930, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. ఏహెచ్‌టీయూ కానిస్టేబుల్‌ రాజేందర్‌, కళాబృందం సభ్యులు ప్రభాకర్‌, సాయిలు, లేబర్‌ అడ్డా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాస్‌, డైలీ లేబర్‌ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement