కామారెడ్డి క్రైం: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపధ్యంలో క్షేత్రస్ధాయిలో విధులు నిర్వహించే జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో రెయిన్ కోట్‌లను శనివారం కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజాసమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి, డీపీఆర్వో తిరుమల, డీపీవో మురళి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


