బాన్సువాడ: బాన్సువాడ మున్సిపల్ పరిధిలో చెత్త వేయవద్దని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని 3, 4, 8, 9,18 వార్డుల్లో సభలు నిర్వహించారు. ఆయా వార్డుల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, జల్ సంచయ్–జల్‌భాగీదారి పథకం కింద వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, మురుగు కాలువల పూడికతీత, శుభ్ర పరచడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఆయా వార్డు కౌన్సిలర్లు రేష్మబేగం, హకీం, రుక్మిణి, శ్యామల, పాశం ఆమని, కో– ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, నాయకులు ఎజాస్, సీఐ శ్రీధర్ ఉన్నారు.


