నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాఘవపల్లి గ్రామపంచా యతీ పాలకవర్గ సభ్యులు శనివారం హైదరాబాదు లోని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. గ్రామసర్పంచ్ నార్ల గంగామ ణి, ఉపసర్పంచ్ సూరయ్యతోపాటు వార్డు సభ్యులు సురేందర్, బాలమణి, వెంకయ్య, ఇందిరమ్మ, పాప య్య, రుక్మిణి, భాస్కర్, గంగయ్య, రమేష్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ భర్తకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ గౌడ్, ఆత్మకమిటీ డైరెక్టర్ కిష్ఠాఫర్ తదితరులు పాల్గొన్నారు.


