ఎల్లారెడ్డి: ప్రజలు తమ ఇంటిలో తడి, పొడి చెత్తను వే ర్వేరుగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ అ న్నారు. శనివారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 4, 5, 6 వార్డులలో సభలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించనున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో నీటిని వేడి చేసి చల్లార్చిన తరువాత తాగాలని సూచించారు. కౌన్సిలర్లు మంజుల, చంద్రయ్య, గఫార్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్ తదితరులున్నారు.


