అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు పెంచాలి

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు పెంచాలి ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు కుర్మ సంఘం కార్యవర్గం ఎన్నిక

ఎల్లారెడ్డిరూరల్‌: అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలను పెంచాలని కోరుతూ శనివారం సూపర్‌వైజర్లకు వినతిపత్రం అందించారు. అంగన్‌వాడీ సిబ్బందికి నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ప్రతి నెలా 1న వేతనాలు అందించాలని, గత ఏప్రిల్‌కు సంబంధించిన వేతనాన్ని ఇవ్వాలని కోరుతూ అంగన్‌వాడీ టీచర్లు దేవకర్ణ తదితరులు కలిసి సూపర్‌వైజర్లు స్వప్న, హారతి, ఈశ్వరీబాయిలకు అందించారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఎంపీడీవో నరేష్‌ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ తండాలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.

లింగంపేట(ఎల్లారెడి): పొల్కంపేట గ్రామ కుర్మ సంఘం కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా కడాల రాజు, ఉపాధ్యక్షుడిగా చిల్లెల్ల రవి, కోశాధికారిగా కొల్పుల రమేశ్‌, సహాయ కోశాఽధికారిగా గడ్డం సతీష్‌, ప్రధాన కార్యదర్శిగా కడాల ఎల్లేశంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం సన్మానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement