సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

దోమకొండ: గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌ కోరారు. శనివారం లింగుపల్లి, చింతమాన్‌పల్లి గ్రా మాల్లో నిర్వహించిన 99 రోజుల కార్యాచరణ ప్రణా ళిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీజనల్‌ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. హరితహారంలో మొక్కలు నాటాలని, ఇంకుడు గుంతల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. తడి పొడి చేత్త వేర్వేరుగా చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంద శాతం పూర్తి చేసేలా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు చొరవ చూపాలన్నారు. సర్పంచ్‌లు లక్ష్మి, సిద్ధరాములు, పంచాయతీ కార్యదర్శి రమేశ్‌, ఈజీఎస్‌ ఏపీవో రజని, ఏవో మణిదీపిక పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement