కేంద్రీయ విద్యాలయం ప్రారంభించే వరకు ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

కేంద్రీయ విద్యాలయం ప్రారంభించే వరకు ఊరుకోం

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

మద్నూర్‌(జుక్కల్‌): మద్నూర్‌కు మంజూరైన కేంద్రీయ విద్యాలయం పనులు ప్రారంభించే వరకు ఊరుకోమని, దీని కోసం శాంతియుతంగా మా గళం వినిపిస్తామని యువకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పాత రాష్ట్ర రహదారిపై శనివారం యువకులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2019లో మద్నూర్‌కు మంజూరైన కేంద్రీయ విద్యాలయం పనులు ఇంత వరకు ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. గతంలో ఉన్న పాలకులు, ప్రస్తుతం ఉన్న పాలకులు కేంద్రీయ విద్యాలయంపై నిర్లక్ష్యం చేయడం వల్లనే ఏడేళ్లుగా కేంద్రీయ విద్యాలయం మొదలు కాలేదన్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నా ఫలితం కనపడకపోవడంతోనే రాస్తారోకో చేపట్టామని తెలిపారు. కనీసం కేంద్రీయ విద్యాలయం తాత్కలిక భవనంలో ప్రారంభించి శాశ్వత భవన నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అనంతరం యువకులు తహసీల్దార్‌ ముజీబ్‌కు వినతి పత్రం అందించారు. వార్డు సభ్యుడు నరేష్‌, తుకారాం, సచిన్‌, సురేశ్‌, రవి, పెంటేశ్‌, పింకు, సంజు తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement