రైతులకు అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు అందుబాటులో ఉండాలి

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ : గ్రామ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు రైతులకు అందుబాటులో ఉండి వారికి సేవ చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని, ఆగ్రోస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌లను కలిసిన గ్రామ స్థాయి నాయకులు వారిని సన్మానించారు. ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా గ్రామానికి చెందిన సందుల రవిని నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. రైతులకు సేవ చేసే భాగ్యం అందరికి రాదని, నిరంతరం గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామ స్థాయి నాయకులు కాదేపురం గంగారాం, పండరి, ఇందూరు గజేందర్‌, అశోక్‌, రవి, కామప్ప, వడ్ల నాగయ్య తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement