ఎన్‌ఎంఎంఎస్‌కు మోడల్‌ విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంఎంఎస్‌కు మోడల్‌ విద్యార్థుల ఎంపిక

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

ఎన్‌ఎంఎంఎస్‌కు మోడల్‌ విద్యార్థుల ఎంపిక

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌(నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌ షిప్‌)కు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ రాజిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన డి.మహేందర్‌, రిషిక్‌ రెడ్డి, షేక్‌ అబ్దుల్లా, సంకీర్తన, డి.గీతిక, టి.రష్వితలు ఎంపికై నట్లు తెలిపారు. ఈ పరీక్షను 8వ తరగతిలో రాస్తారన్నారు. 9వ తరగతి పూర్తయిన తర్వాత ఏడాదికి స్కాలర్‌ షిప్‌ రూ.12 వేల చొప్పున వస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల అధ్యాపకులు అభినందించారు. ప్రిన్సిపాల్‌ రాజిరెడ్డి మాట్లాడుతూ...పాఠశాల నుంచి స్కాలర్‌ షిప్‌కు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement