ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్‌

భిక్కనూరు తహసీల్దార్‌

చాంబర్‌ వద్ద ధర్నా

భిక్కనూరు: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో శనివారం భిక్కనూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ చాంబర్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వడ్లను కొనుగోలు చేయడంలో, తూకం వేసిన ధాన్యం బస్తాలను రైస్‌మిల్లులకు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విపలమైందన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ఇంకా కాకపోవడం సర్కారు వైఫల్యానికి నిదర్శనమన్నారు. పోలీసులు వచ్చి తహసీల్దార్‌ సునీతతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులను సముదాయించారు. ధర్నా విషయాన్ని అదనపు కలెక్టర్‌ గిరి దృష్టికి ఫోన్‌ ద్వారా తీసుకువెళ్లగా రెండు రోజుల్లో కొనుగోళ్లను పూర్తి చేసి బస్తాలన్నింటినీ మిల్లులకు తరలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో నేతలు ఆందోళన విరమించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఆందోళనలో బీఆర్‌ఎస్‌ నేతలు అందె మహేందర్‌రెడ్డి, తున్కి వేణు, మద్ది స్వామి, రంజిత్‌ వర్మ, పాల రాంచంద్రం, వెంకట్‌రెడ్డి, ద్యావర సాయిరెడ్డి, పైడి నరేందర్‌రెడ్డి, ద్యావర లక్ష్మి, బస్వయ్య, గంగళ్ల రవీందర్‌, కర్రోళ్ల రాజు, భరత్‌, ముచ్చర్ల రాంరెడ్డి, బాబు, మదుసూదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement