● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
కామారెడ్డి క్రైం: వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్మించిన ఇంకుడుగుంతను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరంఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి చ ర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఇంకుడుగుంత పరిసరాల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు.అలాగే క లెక్టరేట్‌లో ఉద్యోగులకు జ్యూట్ బ్యాగులు, పర్యావరణహిత వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.
మొక్కలు నాటిన అధికారులు
సాక్షి నెట్‌వర్క్: బిచ్కుంద కోర్టు ఆవరణలో ప ర్యావరణ దినోత్సవం సందర్భంగా సివిల్ కోర్టు న్యాయమూర్తి వినిల్ కుమార్ మొక్కలు నాటారు. అలాగే కామారెడ్డి సీనియర్ సిటిజన్స్ ఫోరం జిల్లా భవనం ప్రాంగణంలో అసోసియేషన్ ప్రతినిధులు మొక్కలు నాటారు. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో సర్పంచ్ అనసూయ మొక్కలను నాటా రు. అనంతరం గ్రామస్తులతో కలిసి పర్యావరణా న్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారిణి పద్మావతిని అధ్యాపకులు సన్మానించారు.పెద్దకొడప్‌గల్ మండలం పోచారం గ్రామంలో సర్పంచ్ బాలాజీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క కృషిచేయాలని ఎంపీవో లక్ష్మీకాంత్ రెడ్డి సూ చించారు. బాన్సువాడ కోర్టు ఆవరణలో జడ్జి టీఎస్‌పీ భార్గవి మొక్కలు నాటారు.బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ రైతువేదిక వద్ద సర్పంచ్ అందె రమేష్‌తో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సిబ్బందికి వారు సూచించారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామంలో సర్పంచ్ సాయిలు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పను ల గురించి తీర్మాణం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు.


