పర్యావరణాన్ని కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణాన్ని కాపాడాలి

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

నిజామాబాద్‌ లీగల్‌ : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలని ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జి ఎస్‌. నారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్‌ నినో కారణంగా విపరీతమైన వేడి వాతావరణం ఉంటుందని, ప్రతి ఇంట్లో ఏసీలు పెట్టడంతో వేడిమి ఎక్కువ అయ్యిందని, అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఎదుట మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నీలకంఠరావు, మేజిస్ట్రేట్స్‌ శ్రీనివాస్‌ రావు, చైతన్య, హరికుమార్‌, ప్రధాన కార్యదర్శి సుభాష్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు అవుల నారాయణ, పరిపాలనాధికారి గోవిందరావు, న్యాయవాదులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, రాజు, ఆశ నారాయణ, రవిప్రసాద్‌, న్యాయ సేవా సంస్థ పర్యవేక్షకులు శైలజ, శ్రావణ్‌, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌చార్జి జిల్లా జడ్జి నారాయణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement